రేవంత్ దమ్ముంటే కామారెడ్డి నుండి పోటీ చెయ్యి: కేటీఆర్

-

తెలంగాణాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు మరొక నెల మాత్రమే సమయం ఉంది. కాగా రాష్ట్రంలోని కీలక పార్టీలు బిఆర్ఎస్, కాంగ్రెస్ మరియు బీజేపీలు ప్రచార కార్యక్రమాల్లో తలమునకలై ఉన్నారు. కేసీఆర్ వరుసగా మూడవ సారి గెలిచి సీఎంగా గద్దెనెక్కాలని గట్టిగా కృషి చేస్తున్నారు. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కి బహిరంగ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే కామారెడ్డి నుండి పోటీ చేసి చూడు అంటూ కీలక కామెంట్ చేశాడు కేటీఆర్. కొడంగల్ లో చెల్లని నువ్వు కామారెడ్డి లో చెల్లుతావా అంటూ సెటైరికల్ గా మాట్లాడారు కేటీఆర్. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి కాంగ్రెస్ లేదా బీజేపీ లకు ఓటేస్తే చీకటి రోజులకు వెళ్తాము అంటూ కేటీఆర్ కేసీఆర్ కు మీ అమూల్యమైన ఓటును వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

తెలంగాణాలో ఆయన అందిస్తున్న పధకాలు చేరువ కాని కుటుంబం లేదంటూ కేటీఆర్ మాట్లాడారు. మరి కామారెడ్డి ప్రజలు కేసీఆర్ ను గెలిపిస్తారా లేదా షాక్ ఇస్తారా అన్నది తెలియాలంటే డిసెంబర్ మూడు వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version