మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు కేంద్రం ఉత్తి ప్రశంసలు మాత్రమే కురిపిస్తోంది…నిధుల విషయంలో మొండి చేయి చూపించడం చాలా విడ్డూరమన్నారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణలో అమలవుతున్న పథకాలకు నీతి ఆయోగ్ సైతం నిధులు ఇవ్వాలని కేంద్రానికి సూచించింది. కానీ కేంద్రం మాత్రం తెలంగాణ పై సవతి తల్లి ప్రేమను కనబర్చుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిలా వ్యవహరిస్తోందని పలువురు జాతీయ నేతలు ప్రశంసలు అందిస్తుంటే..ఇక్కడి భాజపా నేతలు, కేంద్ర ప్రభుత్వం మాత్రం తమకు పట్టనట్లు ఉండటం చాల దారుణం అన్నారు.
పోలవరం నిర్మాణానికి 90 శాతం నిధులు అందించామని చెప్పుకుంటున్న భాజపా తెలంగాణ విషయంలో మాత్రం తీవ్ర అన్యాయం చేస్తుందని తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో తెరాస కార్యకర్తలంతా కలిసి పనిచేసి మరోసారి రాష్ట్రా పురోగతికి సహకరించాలన్నారు. భాజపా పాలిత ప్రాంతాల్లో నిధుల కొరత లేకుండా రాష్ట్రాలకు సాయం చేస్తున్నప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.