కేటీఆర్ – మీరా చోప్రా: రీ ట్వీట్ అండ్ థ్యాంక్యూ ట్వీట్!

-

సెలబ్రెటీల ఇరకతరకల పలుకులు – అభిమానుల ట్రోలులు అత్యంత సర్వసాధారణంగా జరిగిపోతున్న రోజులివి. కెరీర్ లో వచ్చిన విజయాలు, అపజయాలు.. కలెక్షన్సూ, బాక్సాఫీసు బద్దలు వంటి వ్యవహారాల్లో జరుగుతూ ఉంటుంది. ఈక్రమంలో తనకు ఎన్టీఆర్ ఎవరో తెలియదు.. తాను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు.. మహేష్ ఫ్యాన్ అన్నందుకు తనపై సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడి వంటి వాటికి పాల్పడతామని బెదిరిస్తున్నారని ట్వీట్ లో పేర్కొంటూ కేటీఆర్ కు చెప్పుకున్నారు మీరా చోప్రా. ఈ విషయంపై కేటీఆర్ వెంటనే స్పందించారు.

“కేటీఆర్ కవిత గారూ.. సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడి బెదిరింపులు మీ రాష్ట్రంలోని కొందరి నుంచి నాకు వస్తున్నాయి. దీనిపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. మహిళల భద్రత కోసం ప్రాధాన్యం ఉన్న అంశంగా పరిగణించి పరిష్కరిస్తారని ఆశిస్తున్నానూ’ అని ట్వీట్ చేసింది మీరా చోప్రా. ఈ ట్వీట్ కు స్పందించి… “”మేడమ్.. ఈ విషయంపై నేను తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీసులతో మాట్లాడాను. మీ కంప్లైంట్ ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారిని కోరాను” అని మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేసారు. దీంతో ఉప్పొంగిపోయిందో ఏమో కానీ… ”థ్యాంక్యూ సార్.. ఇది మహిళ భద్రతకు ఎంతో ముఖ్యమైనది. మహిళల పట్ల నేరాలకు పాల్పడే క్రిమినల్స్ ను వదిలిపెట్టకూడదు” అని థ్యాంక్స్ ట్వీట్ చేశారు మీరా చోప్రా.

ఈ క్రమంలో… హైదరాబాద్ పోలీసులు మీరా చోప్రా కేసును ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేపట్టి.. 8 ట్విట్టర్ ఖాతాల నుంచే అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్టు గుర్తించారు. పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version