ట్యాంక్‌బండ్‌ శివకు డబుల్ బెడ్‌రూమ్‌ ఇల్లు

-

ట్యాంక్‌బండ్ శివ.. హైదరాబాద్‌లో ఈ పేరు తెలియని వారుండరు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతంలో ఈ వ్యక్తి తెలియని వారుండరంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఆ ఏరియాలో ట్యాంక్‌బండ్ శివ అంత ఫేమస్. ఎన్నో ఏళ్లుగా ట్యాంక్‌ బండ్‌ మీదే నివాసముంటున్న శివ ఆ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన వారిని కాపాడారు.

హైదరాబాద్‌ హుస్సేన్‌సాగర్‌లో వేర్వేరు సందర్భాల్లో ఆత్మహత్యకు యత్నించిన 144 మందిని కాపాడిన గజ ఈతగాడు శివకు తాజాగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అక్కడికి సమీపంలో ప్రభుత్వం నిర్మించిన రెండు పడకగదుల ఇంటిని కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రికి శివ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్‌ను తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు. ఈ వీడియోను ఒక నెటిజన్‌ గురువారం మంత్రికి ట్వీట్‌ చేయగా… ఆయన స్పందించారు. త్వరలోనే శివ ఇంటికి వెళ్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version