తమది ఒకటే ఎజెండా.. కానీ బిజెపి మాత్రం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.!

-

ప్రస్తుతం దుబ్బాకలో ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ప్రతిపక్ష అధికార పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ టీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శలు తెలంగాణ రాజకీయాలను మరింత హాట్ హాట్గా మారుస్తున్నాయి. ఇక దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే .

ఇక ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీలైన బిజెపి-కాంగ్రెస్ ల పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు 28 రాష్ట్రాలు ఉన్నాయి అంటూ తెలిపిన కేటీఆర్… 28 రాష్ట్రాలలో ఇరవై ఎనిమిది వందల ఎజెండాలు ఉన్నాయి అంటూ ఎద్దేవా చేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అలా కాదని ఒకే రాష్ట్రం ఒకే ఎజెండాతో ముందుకు సాగుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పరుగులు పెడుతోంది అంటూ తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version