ఏపీలో రాజధాని మార్పుపై కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు…!

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై తెలంగాణా మంత్రులు, అక్కడి రాజకీయ నాయకులు కీలకవ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు తెలంగాణకు కలిసి వస్తున్నాయని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేసిన తర్వాత తెలంగాణా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ కుప్పకూలిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

తాజాగా తెలంగాణా మంత్రి కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. మీడియాతో కాసేపటి క్రితం మాట్లాడిన కేటిఆర్, జనసేన అంతర్జాతీయ పార్టీ కూడా కావొచ్చేమో అంటూ కేటిఆర్ ఎద్దేవా చేసారు. పవన్ కళ్యాణ్ ఏం చేస్తే మాకేం సంబంధమని వ్యాఖ్యానించిన కేటిఆర్, ఆయన రాజకీయాలపై ఏపీ ప్రజలు చూసుకుంటారని వ్యాఖ్యానించారు. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం గురించి కూడా కేటిఆర్ స్పందించారు.

ఏపీలో రాజధాని మారుస్తామంటే ఆందోళనలు చేస్తున్నారన్న ఆయన, తెలంగాణలో చిన్న ఆందోళన కూడా లేకుండా జిల్లాల విభజన చేశామని గుర్తు చేసారు. ఏపీలో రాజధాని మార్పుపై ఇంత ఆందోళన, వ్యతిరేకత ఎందుకు వస్తోందో ఆలోచించాల్సి అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇక ఇదిలా ఉంటే ఏపీలో మూడు రాజదానులకు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version