మేయర్ ‘గిరీ’ ఎవరికో తేల్చనున్న టీఆర్ఎస్..కేటీఆర్ కీలక సమావేశం

-

ఈ రోజు తెలంగాణ భవన్ లో కీలక సమావేశం జరగనుంది. గెలిచిన అందరు కార్పొరేటర్ లతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటి కానున్నట్టు చెబుతున్నారు. గ్రేటర్ ఎమ్మెల్యేలకు కూడా సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం అందినట్టు చెబుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుండగా మేయర్ ఎవరు అనే దాని మీదనే ముఖ్యంగా చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

ఈసారి మేయర్ పదవి జనరల్ మహిళకి కేటాయించారు. దీంతో ఈ పదవికి ముందు కంటే ఎక్కువ పోటీ నెలకొంది. నిజానికి ఈసారి అసలు మేయర్ పదవిని ఎంఐఎంతో కలిసి రెండున్నర ఏళ్ళు పంచుకోవాల్సి రావచ్చు. దీంతో అసలు ఏమి చేస్తే బాగుంటుంది అనే అంశాలు ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈసారి ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో టీఆర్ఎస్ కి టెన్సన్ తప్పడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version