తెలంగాణలో ఇంటర్నెట్ కష్టాలకు చెక్..

-

అవును ఇక తెలంగాణా పల్లెలలో ఇంటర్నట్ కష్టాలు తొలగిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇక మీదట అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడానికి సిద్దం అయినట్టు చెబుతున్నారు. ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల భవనాలకు ఫైబర్‌ లైన్‌ వేయడం పూర్తయ్యిందని అంటున్నారు. ప్రభుత్వ సూచనల మేర గ్రామ పంచాయతీలు కూడా కంప్యూటర్లను సమకూర్చుకున్నాయి. దీంతో త్వరలోనే తెలంగాణ గ్రామాలు డిజిటల్‌ రూపును సంతరించుకోనున్నాయి.

ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలు, పంచాయతీ రికార్డుల నిర్వహణ వగైరా అన్ని పనులు ఇంటర్నెట్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే ఈ పనులన్నింటికీ ఇంటర్నెట్‌ సిగ్నల్‌ అడ్డంకిగా మారింది. కొన్ని మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్‌ సిగ్నల్‌ సరిగా లేక అర్ధరాత్రుళ్ళు సైతం పని చేయాల్సి వస్తోంది. ఈ క్రమమో ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఫైబర్‌నెట్‌ సదుపాయం కల్పించనున్నది. ఇక ఈ ఫైబర్ నెట్ ను నిజామాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. మొత్తం 918 గ్రామాలను ఇందుకోసం ఎంపిక చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version