నాన్ బీజేపీ ప్రభుత్వాలపై కేంద్రం సహాయనిరాకరణ.. కేటీఆర్ ట్వీట్

-

కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాన మంత్రి మోదీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. ఎప్పటిమాదిరి ట్విటర్​లో ట్వీట్ల వర్షం కురిపించారు. ట్విటర్ వేదికగా మరోసారి.. కేంద్రం పట్ల నిరసన వ్యక్తం చేశారు.

నాన్ బీజేపీ రాష్ట్రాల ప‌ట్ల కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిని మంత్రి కేటీఆర్ త‌ప్పుబట్టారు. గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని అభిప్రాయ‌ప‌డుతూ తెలంగాణ ప్ర‌భుత్వ డిజిటిల్ మీడియా డైరెక్ట‌ర్ కొణ‌తం దిలీప్ చేసిన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.

దేశంలోని నాన్ బీజేపీ రాష్ట్రాల్లో ఉన్న గ‌వ‌ర్న‌ర్ల త‌మ అధికారాల‌ను నిర్ధాక్షిణ్యంగా దుర్వినియోగం చేస్తున్నార‌ని, గ‌వ‌ర్న‌ర్‌కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చేసిన తీర్మానాన్ని స‌మ‌ర్థిస్తూ కొణ‌తం దిలీప్ ట్వీట్ చేశారు.

మంత్రి కేటీఆర్ ఈ ట్వీట్​ను రీట్వీట్ చేస్తూ.. ‘దేశంలో ప్ర‌జాపాల‌న చాలా బాధాక‌రంగా సాగుతోంది. రాజ్యాంగ‌ప‌ర‌మైన ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉన్న‌వారు.. కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో రాజ‌కీయ పావులుగా మారుతున్నారు. నాన్ బీజేపీ రాష్ట్రాల‌ను ఓసారి గ‌మ‌నించండి. కేంద్రం ఆ రాష్ట్రాల‌కు స‌హ‌క‌రించ‌డం లేదు. ప్ర‌తీకారేచ్ఛ‌తో వ్య‌వ‌హ‌రిస్తోంది.’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version