హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్‌నగర్ లో… రోజు వారీ కూలీలు లకాన్ సింగ్, జ్యోతి. ఊరు గాని ఊరు వచ్చారు. అనారోగ్య కారణాలతో జ్యోతి చనిపోయింది. నెల రోజుల క్రితం ఆమె 4 నెలల పాపను భర్తను ఒంటరి చేసి వెళ్లిపోయింది. తండ్రి తానే స్వయంగా పాపను పోషిస్తున్నాడు. తల్లి పాలు తాగాల్సిన పాప ప్యాకెట్ పాలు తాగుతుంది. లాక్ డౌన్ తో పాపకు గురువారం తండ్రి పాల ప్యాకెట్ కొనలేదు.
ఎంత తిరిగినా సరే పాల ప్యాకేట్ దొరకలేదు. ఆకలి తో పాప అర్ధరాత్రి ఏడుస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ఇంటి పక్కన ఉండే నవీన్ అనే యువకుడు మంత్రి కేటిఆర్ కి ట్విట్టర్ లో సమస్యను వివరించాడు. మంత్రి ట్వీట్ చూసి వెంటనే స్పందించి.. బొరబండ దగ్గరలో ఉండే డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌కు విషయం చెప్పారు. పాపకు పాలు ఇవ్వాలని చెప్పారు. కేటీఆర్ ఆదేశాలతో అర్ధరాత్రి వెంటనే ఒంటి గంట సమయంలో…
ఎర్రగడ్డ కు పాలు తీసుకుని వెళ్లి పాప తండ్రికి ఇచ్చాడు. అలాగే ఆ కుటుంబానికి నెల రోజులకు సరిపడా సరుకులను ఇచ్చారు. దీనితో వెంటనే పాపకు పాలు ఇచ్చి డిప్యూటి మేయర్ కి ధన్యవాదాలు తెలిపారు. కేటిఆర్ సోషల్ మీడియా లో ముందు నుంచి యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఏ సమస్య ఉన్నా సరే వేగంగా స్పందిస్తూ ఉంటారు.