1,60,083 ఉద్యోగాలను భర్తీ చేశాం: కేటీఆర్

-

గత 9.5 ఏళ్లలో 1.60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ‘డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు 2,32,308 అని ప్రభుత్వం గుర్తించింది. అందులో 1,60,083 ఉద్యోగాలను భర్తీ చేశాం. జనాభా నిష్పత్తి ప్రకారం దేశంలో ఇంత స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ ఉద్యోగాల భర్తీ జరగలేదు. ఉద్యోగాల గురించి పూర్తి వివరాల కోసం https://telanganajobstats.in ‘ లో చుడండి అని ట్వీట్ చేశారు.

అంతే కాదు, సీఎం కేసీఆర్‌కు అండగా నిలిచి.. ఢిల్లీ గద్దల నుండి తెలంగాణను కాపాడుకుంద్దామని మంత్రి కేటీఆర్ అన్నారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా దౌల్తాబాద్ మండల కేంద్రంలో కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడతూ.. లుచ్చమాటలతో దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ రావుకు అసెంబ్లీ ఎన్నికలల్లో బుద్ది చెప్పి ఇంటికి. పంపించాలన్నారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామని.. మరో సారి నమ్మితే రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. మహిళలకు సౌభాగ్య లక్ష్మీ పేరిట రూ.3 వేలు అందించడంతో పాటుగా, దశల వారీగా ఫెన్షన్లు పెంచుతామని హామీనిచ్చారు. బీజేపీ నాయకులకు డిల్లీ నుండి, కాంగ్రెస్ నాయకులకు కర్ణాటక నుండి పైసలు వస్తున్నాయని, ఆ డబ్బులతో ఎన్నికలల్లో గెలువాలని చూస్తున్న ఆ రెండు పార్టీలకు 30 వ తారీఖున బుద్ది చెప్పాలన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version