తెలంగాణ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం నేను ఓటు వేశాను అని పేర్కొన్నారు KTR. నంది నగర్ లోని జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంది కేటీఆర్ కుటుంబం. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ఐదేళ్లకోసారి ప్రభుత్వాలని ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలు అన్నారు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం ఉందని తెలిపారు.
మన ప్రభుత్వాలని మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈరోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదు….దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయండని కోరారు. మంచి ప్రభుత్వాలను మంచి నాయకులను మీ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటు వేయండన్నారు. పోలింగ్ స్టేషన్లో దగ్గర కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారులతోని తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుందని వివరించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ తెచ్చిన పార్టీ నాయకుడు కేసీఆర్… తెలంగాణ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం నేను ఓటు వేశానని వివరించారు కేటీఆర్.