తెలంగాణలో ఇప్పుడు ఈటల రాజేందర్ (Etela Rajender) వ్యవహారం టాప్ ట్రెండింగ్‌లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆయన గురించే చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు ఆయన ఏ పార్టీలో చేరతారు? ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ వినిపించిన ప్రశ్నలకు ఆయన నిన్న సమాధానం చెప్పారు. తన పార్టీ పదవికి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఇక్కడే టీఆర్ఎస్ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు.
మొదటి నుంచి ఈటల రాజేందర్ వ్యవహారంలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆయనపై కేవలం కొందరితోనే విమర్శలు చేయిస్తోంది. గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాంటి నాయకులే విమర్శలు చేస్తున్నారు.
అలాగే హుజూరాబాద్ రాజకీయాల్లోనూ ఈటలను ఒంటరి చేసేందుకు గంగులు, వినోద్ కుమార్, హరీష్ రావులనే కేసీఆర్ పురమాయించారు. కానీ కేటీఆర్‌ను మాత్రం ఆ రాజకీయాలకు దూరంగా ఉంచారు. ఇప్పటి వరకు కేటీఆర్ ఈటల వ్యవహారంపై గానీ, హుజూరాబాద్ పార్టీ విషయంలోగానీ స్పందించలేదు. ఎందుకంటే కేటీఆర్‌పై ఎలాంటి రిమార్కు ఉండకుండా చూసేందుకే కేసీఆర్ ఈ ప్లాన్ వేశారని తెలుస్తోంది. ఈటల వ్యవహారంలో స్పందిస్తే ఎక్కడ విమర్శలు వస్తాయేమో అని కేటీఆర్‌ను దూరంగా ఉంచారంట గులాబీ బాస్.