Kuberaa Review: స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చాలా రోజుల తరువాత తెరకెక్కిస్తున్న మూవీ కుబేర. ఈ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. కుబేర సినిమా ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రేక్షకులలో పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. అత్యంత ధనవంతుడు ఏమి ఆశించని బిచ్చగాడికి మధ్య జరిగే పోరాటమే కుబేర సినిమా కథ. బిచ్చగాడి పాత్రలో హీరో ధనుష్ ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తో అద్భుతంగా నటించారు.

హీరో నాగార్జున, నటి రష్మికలు పాత్రలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. కుబేర సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాలో ఎన్నో ట్విస్టులు, ఎమోషనల్ సన్నివేశాల మధ్య సినిమా అద్భుతంగా ఉంది. కుబేర సినిమాకు డిఎస్పి సంగీతం అందించారు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. రన్ టైమ్ ఎక్కువగా ఉండడం, స్లో స్టార్ట్, మొదటి భాగంలో కాస్త సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.