కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎందుకంటే శుక్రవారం ఉదయం కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని హౌసింగ్ స్థలాల వేలంలో భాగంగా ముందస్తుగా ఆయన్ను గృహనిర్బంధం చేసినట్లు తెలుస్తోంది.
ఆయన ఇంటి ముందు ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ కీలక నేతలను సైతం ముందస్తుగా నిర్బంధించినట్లు సమాచారం. హౌసింగ్ స్థలాల వేలంగా ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే బీఆర్ఎస్ నియోజక ఎమ్మెల్యే, ఆ పార్టీకి చెందిన కీలక నేతలను పోలీసులను ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష గులాబీ పార్టీ నేతలు పెద్దఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.