న్యాయవాది గట్టు వామన్ రావ్ దంపతుల హత్య కేసు లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కుల దేవత గుడి వివాదమే హత్య కు కారణం అని తెలుస్తోంది. ఈ కేసులో ఆడియో క్లిప్స్ కూడా కీలకంగా మారాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు ఉన్నట్టు చెబుతున్నారు. హత్యకు పాల్పడిన కుమార్ , చిరంజీవి , దాస్ అనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుంటా శ్రీను కాల్ డేటా అనాలసిస్ చేసిన రామగుండం పోలీసులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు కనుగొన్నారు.
గుంజపడుగులో గుడి వివాదమే ముఖ్య కారణమని భావిస్తున్నారు పోలీసులు. గుడిని కూల్చేస్తే వామన్‌రావు కూలిపోతాడని కుంట శ్రీను వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. వామన్‌రావు డ్రైవర్ సమాచారంతో కుంట శ్రీనివాస్ ఆడియోని సేకరించి కుమార్, చిరంజీవి, దాస్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో సికాసలో పనిచేసిన కుంట శ్రీనివాస్ పై అనేక కబ్జా, బెదిరింపుల కేసులు ఉన్నట్టు చెబుతున్నారు. ఘటనాస్థలంలో ఐదుగురు ఉన్నట్టు తేల్చిన పోలీసులు, కుంట శ్రీనివాస్‌ను పట్టుకుంటామని చెబుతున్నారు.