శ్రీశైలంలో కుమారస్వామి ఆలయ నిర్మాణ అంశం ఇప్పుడు వివాదానికి దారితీసింది. నిర్మాణ పనులు ప్రారంభించే దశలోనే అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఒకరిద్దరు పీఠాధిపతులు కుమార స్వామి ఆలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుండగా తాజాగా వీరశైవులు కూడా గళం విప్పారు. శ్రీ శైలం ప్రధాన ఆలయం వెనుక భాగంలో 16 ఎకరాల విస్తీర్ణంలో కుమారస్వామి ఆలయ నిర్మాణానికి గతంలో భూమి కేటాయించారు. 2018 మార్చి 8న శృంగేరి పీఠాధిపతి చేతుల మీదుగా శిలాన్యాసం చేశారు.
అద్భుతంగా ఆలయం నిర్మించడంతో పాటు అందమైన ఉద్యానవనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిజానికి కుమారస్వామి విహారం నిర్మిస్తే శ్రీశైలం క్షేత్రానికి మరింత ఆకర్షణ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం సందర్శించే భక్తులు, పర్యాటకులు అద్భుతమైన అనుభూతి పొందేలా నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయాలని ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. అయితే, కుమారస్వామి ఆలయ నిర్మాణాన్ని కొందరు స్వామిజీలు, వీరశైవులు వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ వివాదం ఎండాకా వెళ్తుందో వేచి చూడాలి.