ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కుంభమేళా నేటి నుంచి ప్రారంభమైంది. దాదాపు 45 రోజుల పాటు అనగా నేటి నుంచి మార్చి 4వ తేదీ వరకు ఈ కుంభమేళా కొనసాగనుంది. దేశ విదేశాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.2000 కోట్లతో కుంభమేళ జరగనున్న ప్రయాగ్‌రాజ్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. 192 దేశాల నుంచి దాదాపు 12 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా, వీటి నిర్వహణకు రూ.2,800 కోట్లు కేటాయించింది యూపీ సర్కార్. దీని కోసం 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, 22 పంటూన్ వంతెనల్ని నిర్మించారు. కేంద్ర బలగాలతో అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.