ఈ నెల 21 నుంచి 30 వరకు మొత్తం మూడు విడతల్లో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తొలి విడతగా 4,479 పంచాయతీలు, 39,822 వార్డులకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…ఇప్పటికే 769 సర్పంచ్‌లు, 10,654 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని సోమవారం సాయంత్రం రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియాకు వెల్లడించింది. ఏకగ్రీవాలు పోగా మిగతా వాటికి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎన్నిక నిర్వహించనున్నారు. రెండోవిడతగా 4,135 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, సర్పంచ్ స్థానాలకు 25,419 నామినేషన్లు వచ్చాయి.
36,602 వార్డుస్థానాలకు 91,458 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల పరిశీలన సోమవారం నిర్వహించి అర్హులైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించారు. మూడోవిడతలో 4,115 పంచాయతీలు, 36,718 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 19న నామినేషన్లను పరిశీలించి అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. అయితే ఏకగ్రీవాలకు ప్రభుత్వం నజరానాలను ప్రకటించగా మెజార్టీ పెద్దలు ఆదిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి.