సీఎం కేసీఆర్ పై కూనంనేని వివాదాస్పద వ్యాఖ్యలు..

-

పాల్వంచ చేరుకున్న ప్రజాపోరు యాత్రలో కూనంనేని హాట్ కామెంట్స్ చేశారు. మోడీ ని గద్దె దింపే ప్రయత్నం జరుగుతుంది.. కేసీఆర్ కూడా తన తప్పులు దిద్దుకోపోతే గద్దె దించడం ఖాయమని హెచ్చరించారు. పూటకో పార్టీ మారే వ్యక్తులకు కమ్యూనిస్టు ల గురించి మాట్లాడే అర్హత లేదు…. తెలంగాణ లో సీపీఐ సీపీఎం పార్టీలు లేకుండా గెలిచే మొనగాడు ఎవరున్నారన్నారు.

ఖమ్మం జిల్లాలో ఒక నాయకుడు అన్ని సీట్లు మావే అని…ఓక నాయకుడు అసెంబ్లీ గేట్ కుడా తకానియము అని వాగ్దానాలు చేస్తున్నారని తెలిపారు. ఎర్రజెండాల మద్దతు లేకుండా ప్రభుత్వాలు ఏర్పాటు కావు….కార్మికుల పక్షాన పోరాడేది కమ్యూనిస్టు పార్టీలేనని తెలిపారు. కొత్తగూడెం నియోజకవర్గం సీపీఐ కంచుకోట అని.. రాబోయే కాలంలో మనమంతా ఏకమై మళ్ళీ ఎర్రజెండా ఎగురవేయాలని కోరారు కూనంనేని.

Read more RELATED
Recommended to you

Exit mobile version