టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన చిత్రం శకుంతలం. ఈనెల 14వ తేదీన విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. భారీ అంచనాల మధ్య గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ విషయంతో తాజాగా చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా జాగ్రత్త పడాల్సిందే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..
చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలని చాలా జాగ్రత్తగా తెరకెక్కించకపోతే ఎన్నో విమర్శలు పాలు అవ్వాల్సి వస్తుందని నిరూపించిన చిత్రం శాకుంతల.. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఉంటే చాలు ఆడియెన్స్ థియేటర్లకు వచ్చేస్తారనుకుంటే పొరపాటే! ప్రస్తుతం సినిమాల విషయంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయిందనే విషయం శాకుంతలతో పూర్తిగా అర్థమవుతుంది. కథలో డ్రామా, పాత్రల మధ్య ఎమోషనల్ కనెక్షన్స్ ఉండాల్సిందే.. లేకపోతే ఫలితం ఊహించని రీతిలో ఉంటుందని అర్థమవుతుంది.
కాగా ఈ సినిమాలో కథ, కథనం, ప్రధాన పాత్రల మధ్య కెమిస్ట్రీ, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, పాత్రలు సహజంగా అనిపించకపోవడం, పేలవ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, సెట్టింగ్స్ ఇలా పలు అంశాలు సినిమాకు నెగటివ్ టాక్ తెచ్చిపెట్టాయి. అయితే ఇదంతా ఇప్పుడు ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీమ్‌ను, వారి అభిమానులను బాగా కంగారు పెడుతున్నట్లు తెలుస్తోంది.
శకుంతలలో ఎలాంటి తప్పిదాలు జరిగాయో అవే ఆది పురుషులో కూడా రిపీట్ కానున్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, టీజర్, పోస్టర్స్ ఎవర్నీ ఆకట్టుకోలేకపోయాయి. సోషల్‌మీడియాలో ఫుల్ ట్రోల్స్‌కు గురయ్యాయి. ఇక చేసేదేమి లేక సినిమాను వాయిదా వేసిన మూవీటీమ్ విజువల్ ఎఫెక్ట్స్, ఇతర అంశాలపై మళ్లీ పూర్తి ఫోకస్ పెట్టి వర్క్ చేస్తోంది.
అయితే ఈ వర్క్ పూర్తి చేయటం మొదలుపెట్టాక విడుదలైన పోస్టర్స్ మళ్లీ ఆడియెన్స్‌ను నిరాశపెట్టాయి. గ్రాఫిక్స్ విషయంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ పూర్తిగా మార్చటం సాధ్యమయ్యే పని కాదు.. మరి ఏం చేస్తారో కానీ.. ఔట్ పుట్‌పై ప్రస్తుతం అందరికీ డౌటే ఉంది. ముఖ్యం ప్రభాస్ అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. అలానే ఆదిపురుష్ టీమ్ కూడా బయటకు చెప్పుకోలేకపోయినా ఆ భయం వారిని కూడా వెంటాడుతుందనే అనిపిస్తోంది. ఏదేమైనా.. చారిత్రక కథలను స్క్రీన్‌పై సరిగ్గా ప్రెజెంట్ చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి. కొంచెం అటు ఇటు అయితే మాత్రం దారుణ ఫలితాలు వస్తాయి. చూడాలి మరి ‘ఆదిపురుష్’ సినిమా ఏం చేస్తుందో..