బస్సు బోల్తా పలువురికి తీవ్ర గాయాలు..

-

పశ్చిమ గోదావరి జిల్లా పెరవలీ సమీపంలో హైవేపై కె.వి.ఆర్ ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారు జామున బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో పలువురికి తీవ్ర గాయాలు అయ్యా‌యి. వీరిని సమీపంలోని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి హైవే పెట్రొలింగ్ పోలీసులు త‌ర‌లించారు. పెరవలి హైవేలో రైలింగ్ ను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా ప‌డ‌టంతో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఒంగోలు నుండి శ్రీకాకుళం వెళ్తున్న ఈ బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఎవ్వరికి ప్రాణహాని లేకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version