లగచర్ల ఘటన.. నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్వీ బృందం

-

సీఎం రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో గల లగచర్ల భూములను ఫార్మా సిటీ కోసం ప్రభుత్వం సేకరించే పనిలో భాగంగా అధికారులు సర్వే కోసం వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కలెక్టర్, రెవెన్యూ అధికారులకు వ్యతిరేకంగా స్థానిక రైతులు, బీఆర్ఎస్‌వీ నేతలు ఆందోళనకు దిగారు.

అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో లగచర్ల రైతులతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులపై ఇందిరమ్మ రాజ్యం క్రిమినల్ కేసులు పెట్టింది. ఈ కేసులో మంగళవారం నాంపల్లి క్రిమినల్ కోర్టులో బీఆర్ఎస్వీ బృందం చటారి దశరథ్, జంగయ్య, ప్రశాంత్, శ్రీకాంత్ ముదిరాజ్, అవినాష్, శ్రీను నాయక్, రమేష్ గౌడ్, నాగేందర్, నరేష్ హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news