గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మియాపూర్‌లో ఓ లారీ బీభత్సం సృష్టించింది.ఈ ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.వారిని వెంటనే ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకివెళితే.. కూకట్‌పల్లి రోడ్డు నుంచి మియాపూర్ వైపు వెళ్తున్న లారీ.. మెట్రో పిల్లర్ నెం. 600 వద్ద యూటర్న్ తీసుకుంటుండగా, అతివేగంతో ట్రాఫిక్ పోలీసుల గొడుగును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన కానిస్టేబుళ్లను చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.