లాల్ సలామ్ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో మార్పు?

-

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో నటించిన చిత్రం లాల్ సలాం. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకులకు ముందుకు భారీ అంచనాలతో వచ్చింది. అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద సరైన ఆదరణను రాబట్టుకోలేకపోయింది.ఇదిలా ఉంటే… సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’ సినిమా ఓటీటీ రిలీజ్పై సందిగ్ధం నెలకొంది.

ఓటీటీ హక్కులను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ .. చిత్రీకరణ సమయంలో మిస్ అయిన 21రోజుల ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసిందట. మూవీ ఫస్ట్ ఆఫ్ కి సంబంధించి 21 రోజుల ఫుటేజ్ కోల్పోయామని డైరెక్టర్ ఐశ్వర్యా రజనీకాంత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘క్రికెట్ కి సంబంధించిన సన్నివేశాలు 20 కెమెరాలతో రియల్ మ్యాచ్ వలె షూట్ చేశాం అని అన్నారు. దురదృష్టవశాత్తూ అది పోగొట్టుకున్నాం అని తెలిపారు. ఈ ప్రభావం మూవీపై గట్టిగా పడింది’ అని ఆమె చెప్పారు.ఈనెల 12న నెట్ ఫ్లిక్స్ కి బదులు ‘సన్ నెక్స్ట్’లో ప్రసారం కానుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version