BheemlaNayak : ”లాలా” వీడియో ప్రోమో రిలీజ్‌.. మందు బాటిల్‌ తో దుమ్మలేపిన పవన్‌

-

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. ప్రస్తుతం వరుస సినిమాలతో బీజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న లెటెస్ట్‌ మూవీ భీమ్లా నాయక్‌. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్‌ సినిమా ను సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతోంది. ఇక ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రానా సరసన సంయుక్త నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలోని లాలా భీమ్లా అనే వీడియో  ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం.

సౌండ్‌ ఆఫ్‌ భ్లీమా పేరుతో లాలా వీడియో ప్రోమోను భీమ్లా నాయక్‌ చిత్ర బృందం విడుదల చేసింది. లుంగీ, మందు బాటిల్‌ తో పవన్‌ కళ్యాణ్‌ ఈ ప్రోమో లో కనివిందు చేశారు. అలాగే… నాగరాజు గారు… దీపావళి మీకు ముందుగానే వచ్చేసిందంటూ పవన్‌ కళ్యాణ్‌ చెప్పే డైలాగ్‌ ఈ ప్రోమోకు హైలెట్‌ గా నిలిచింది. ఇక ఈ లాలా సాంగ్‌ ఫుల్‌ వీడియో నవంబర్‌ 7 వ తేదీన విడుదల కానున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version