న్యూజిలాండ్ పై పోరాడి ఓడిన స్కాట్లాండ్

-

ట్వి 20 ప్ర‌పంచ క‌ప్ లో ఈ రోజు న్యూజిలాండ్ , స్కాట్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ విజ‌యం సాధించింది. స్కాట్లాండ్ జ‌ట్టు పోరాడినా.. ప‌రాజ‌యం మాత్రం త‌ప్ప‌లేదు. ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ టాస్ గెలిచి ముందుగా ఫిల్డింగ్ ఎంచు కుంది. దీంతో మొద‌ట బ్యాటింగ్ న్యూజిలాండ్ జ‌ట్టు చేసింది. నిర్ణ‌త 20 ఓవ‌ర్ల‌లో న్యూజిలాండ్ జ‌ట్టు 5 వికెట్ల ను కొల్పోయి 172 ప‌రుగులు చేసింది.

 

అయితే న్యూజిలాండ్ ఒపెన‌ర్ మార్టిన్ గ‌ప్టిల్ 93 ప‌రుగులు కేవ‌లం 56 బంతుల్లోనే చేల‌రేగడంతో భారీ స్కోర్ చేస్తుంద‌ని అనుకున్నారు. కానీ స్కాట్లాండ్ బౌల‌ర్లు విజృంబించ‌డం తో 172 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌క‌లిగింది. 173 టార్గెట్ తో బ‌రి లోకి దిడిన స్కాట్లాండ్ 5 వికెట్లు కొల్పోయి 156 పరుగుల మాత్ర‌మే చేయక‌లిగింది. అయితే క్రికెట్ లో ప‌సికూన అయిన స్కాట్లాండ్ ను ఆలౌట్ చేయ‌డం లో న్యూజిలాండ్ విఫ‌లం అయింది. స్కాట్లాండ్ పై న్యూజిలాండ్ కేవ‌లం 16 ప‌రుగుల తేడా తోనే విజ‌యం సాధించింది. అయితే న్యూజిలాండ్ గెలిచినా.. నైతికంగా స్కాట్లాండ్ గెలిచిన‌ట్టే అని క్రికెట్ విశ్లేష‌కులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version