తుర్కయాంజ‌ల్‌లో స్థల వివాదం.. బైకులకు నిప్పు, అద్దాలు ధ్వంసం

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ పరిధిలోని కమ్మగూడ సర్వేనెంబర్ 241, 242, 243, 245లో ఉన్న ప్లాట్ల విషయంలో ఈవివాదం తలెత్తింది. పలువురు భూ కబ్జా రాయుళ్లు మెహదీపట్నం నుంచి కొందరు మహిళలను బస్సులో తీసుకొచ్చారు.వీరంతా ప్లాట్లలో నివాసం ఉంటున్నారని అసలు ప్లాట్ యజమానులను బెదిరించడానికి ప్రయత్నించారు.

దీంతో ఎదురుతిరిగిన ప్లాట్ ఓనర్స్..తాము గత 20ఏళ్లుగా ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటున్నామని చెప్పారు. అదే టైంలో ఓపెన్ ప్లాట్‌ల తాత్కాలిక గోడలను కబ్జారాయుళ్లు కూల్చేందుకు ప్రయత్నించగా.. ప్లాట్ల యజమానులు, స్థానికులు వారికి ఎదురు తిరిగారు. కబ్జా రాయుళ్లు వచ్చిన బస్ అద్దాలను ధ్వంసం చేశారు.వారి పలు బైక్‌లకు నిప్పు పెట్టారు.కాగా, కమ్మగూడ సర్వే నెంబర్ 240లోని 10 ఎకరాల భూమి విషయంపై ఇప్పిటికే కోర్టులో కేసు నడుస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news