రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఐఏఎస్ స్మితా సబర్వాల్ పర్యవేక్షిస్తున్నారు. మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఈ క్రమంలోనే నిన్న స్వాగత ఏర్పాట్లపై చార్మినార్ సమీపంలోని చౌమొహల్లా ప్యాలెస్‌లో పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ నేపథ్యంలోనే ఆమె బుధవారం ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు.‘మిస్‌వరల్డ్ పోటీల నేపథ్యంలో కొన్ని రోజులు నాకు ఉత్తమ ఉద్యోగం ఉన్నట్లు అనిపిస్తుంది.చౌమహల్లా ప్యాలెస్ వద్ద మిస్‌వరల్డ్-2025 ఈవెంట్ కోసం మా టీమ్‌ను వెల్కమ్, డిన్నర్ కోసం సిద్ధం చేస్తున్నాను. గ్రాండ్ ఓపెనింగ్ వేడుకలకు ఇంకా 30 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అందరూ సిద్ధంగా ఉన్నారు’ అని పేర్కొంటూ అందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేశారు. మే 6, 7 తేదీల్లో ఈవెంట్‌లో పాల్గొనే వారు హైదరాబాద్‌కు రానున్నారు.