రేవంత్ సర్కార్ పలు కీలక శాఖల్లోని రిటైర్డ్ ఉద్యోగులను ఇంటికి పంపించిన విషయం తెలిసిందే. అయితే, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి మాత్రం తిరిగి అదే స్థానంలో పోస్టింగ్ ఇచ్చింది.ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు కీలక దశలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్), హెదరాబాద్ ఎయిర్ పోర్టు మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీగా కీలకంగా వ్యవహరించిన ఎన్వీఎస్ రెడ్డి సేవలను మరికొంత కాలం ఉపయోంచుకోవాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో మరో ఏడాది పాటు ఎన్వీఎస్ రెడ్డిని హెచ్ఎంఆర్ఎల్,హెచ్ఏఎంఎల్ ఎండీగా కొనసాగిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.