9ఏళ్ల కిందట చనిపోయిన వ్యక్తిపై భూ కబ్జా కేసు.. ఎక్కడంటే?

-

తొమ్మిదేళ్ల కిందట చనిపోయిన వ్యక్తిపై వరంగల్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా.. సివిల్ విషయాల్లో తలదూర్చొద్దని చెప్పినా సదరు పోలీసులు మాట వినిపించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భూ దందాలకు వరంగల్ పరిధిలోని ఏజే మిల్స్ పోలీస్ స్టేషన్ అడ్డాగా మారిందని విమర్శలొస్తున్నాయి. ఇదే పోలీస్ స్టేషన్లో జనవరి 21వ తేదీన తన భూమి కబ్జా చేశారని జయశ్రీ అనే మహిళ ఫిర్యాదు చేయగా, కనీస విచారణ చేయకుండా బత్తిని చంద్రశేఖర్ అనే వ్యక్తిపై ఎఫ్ఐఆర్ (47/2025) ఏజే మిల్స్ పోలీసులు నమోదు చేశారని సమాచారం.

విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ కుటుంబసభ్యులు పీఎస్‌కు వెళ్లి అతను చనిపోయి 9ఏళ్లు అయిందని కేసు ఎలా నమోదు చేశారు అని సదరు అధికారిని నిలదీయగా.. సదరు అధికారి రెచ్చిపోయి తనకు ఇష్టం వచ్చిన వారిపై కేసు నమోదు చేస్తానని.. ఎక్కువ ప్రశ్నిస్తే మీపైనా కేసు నమోదు చేస్తామని బెదిరించినట్లు బాధితులు ఆరోపించారు.డబ్బులకు ఆశపడి చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేశారని, ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోని భూదందాలకు పాల్పడుతున్న అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రశేఖర్ కుటుంబసభ్యులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news