70ఏళ్ల వృద్ధురాలిని చంపి మృతదేహంపై డాన్సులు..వీడియో!

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుషాయిగూడలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు వృద్ధురాలికి ఉరేసి చంపి అనంరతం ఆమె మృతదేహం మీద డ్యాన్సులు వేశాడు. ఈ దృశ్యాన్ని వీడియో తీసి తన స్నేహితులకు పంపించాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. కుషాయిగూడలో కమలా దేవి అనే వృద్ధురాలు ఒంటరిగా ఉంటోంది. ఆమె షాపులోనే నిందితుడు అద్దెకు ఉంటున్నాడు. అద్దె విషయంలో వృద్ధురాలు యువకుడిని మందలించడంతో కక్ష పెంచుకున్న అతను.. ఈ నెల 11వ తేదీన వృద్ధురాలిని చంపి తాళం వేసి పారిపోయినట్లు సమాచారం.ఇంట్లోంచి దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news