ORRపై అర్థరాత్రి ఘోర ప్రమాదం.. లారీ డ్రైవర్ సజీవదహనం

-

హైదరాబాద్ పరిధిలోని ఔటర్ రింగు రోడ్డుపై మంగళవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి బ్రిడ్జి మీద నుంచి కింద పడిపోగా డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మియాపూర్ నుంచి బండ్లగూడకు చెత్తను తీసుకెళ్లే లారీ గౌడవెళ్లి సమీపంలో అదుపు తప్పింది. ఓఆర్ఆర్ మీద నుంచి కింద పడిపోగా.. ఈ ప్రమాదంలో లారీ నుంచి మంటలు చెలరేగాయి.

దీంతో డ్రైవర్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయ్యాడు. క్యాబిన్ నుంచి బయటకు వచ్చేందుకు సాధ్యం కాకపోవడంతో డ్రైవర్ కూడా లారీతో పాటే మంటల్లో కాలిపోయాడు. మృతి చెందిన వ్యక్తి అయ్యప్ప మాల ధరించిన డ్రైవర్ సందీప్(27)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదం గురించి వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news