పుష్ప 2 రిలీజ్ ను అడ్డుకుంటాం – జనసేన నేతలు

-

అల్లు అర్జున్ , పుష్ప 2 సినిమాకు జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు వార్నింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే పుష్ప-2 సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు. మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచమే ఇష్టపడుతుందని చెప్పారు.

JANASENA LEADERS WARNS PUSHPA 2

నువ్వు ఒక్కడివే ఒళ్లు కొవ్వెక్కి వారికి వ్యతిరేకంగా ఉంటున్నావు ? అంటూ నిప్పులు చెరిగారు జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు. ఇప్పటికైనా చిరంజీవి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకో అని ఆగ్రహించారు. లేదంటే పుష్ప-2 సినిమాను అడ్డుకుంటాం అంటూ హెచ్చరించారు జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు.

అటు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 సినిమాను రిలీజ్ చేయొద్దు అంటూ బాంబు పేల్చారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. పుష్ప సినిమాలో చూపించింది అంతా అబద్ధం.. ఎర్రచందనం రూ.10 లక్షలుంటే రూ.కోటిలాగా చూపించారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news