కేజీఎఫ్2: అధీరా క్యారెక్టర్ పై లేటెస్ట్ అప్డేట్..

-

అసలేమాత్రం అంచనాలు లేకుండా రిలీజై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేజీఎఫ్ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కన్నడ చిత్ర పరిశ్రమ నుండి అలాంటి సినిమా వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ సినిమాతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కి స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఐతే ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్ 2 రూపొందుతుంది. దాదాపుగా చిత్రీకరణ చివరి దశకి వచ్చేసింది. కేజీఎఫ్ 2 లో అధీరా పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కనిపిస్తున్నాడు.

కేజీఎఫ్ లో కనిపించిన విలన్ కంటే ఎక్కువ క్రూరత్వం కలిగినవాడిగా అధీరా పాత్ర ఉండబోతుందట. అంతటి క్రూరమైన పాత్రకి డబ్బింగ్ ఎవరు చెబుతారానేది ఆసక్తికర అంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం డబ్బింగ్ కింగ్ రవిశంకర్, అధీరా పాత్రకి డబ్బింగ్ చెబుతున్నాడట. సంజయ్ దత్ స్క్రీన్ ప్రెసెన్స్ తో పాటు మాటలో కరుకుదనం అధీరా పాత్రకి మరింత ఎలివేషన్ ని తీసుకువస్తాయట. మరి విలనే ఈ రేంజిలో ఉంటే హీరోయిజం ఏ రేంజిలో ఉంటే అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version