విరాట పర్వం: రానా డబుల్ ధమాకా..

-

నీదీ నాదీ ఒకే కథ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఊడుగుల, రానా హీరోగా విరాట పర్వం అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియమణి కీలక పాత్రలో కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుండి ప్రియమణి లుక్ తో పాటు, సాయి పల్లవి లుక్ కూడా రివీలైంది. ఈ రెండు ఫస్ట్ లుక్ లకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. తొంభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నుండి రెండు అప్డేట్లు రాబోతున్నాయి.

డిసెంబరు 14వ తేదీన విరాట పర్వంలో రానా లుక్ ని రివీల్ చేయనున్నారు. 9:09నిమిషాలకి రానా లుక్ ని, అలాగే 11: 07నిమిషాలకి ఫస్ట్ గ్లింప్స్ ని రిలీజ్ చేస్తారట. ఈ మేరకు వేణు ఊడుగుల ట్వీట్ చేస్తూ, “మాదభరితమైన ప్రేమ లోతుల్లోని తొలి విక్షణం” రేపు విడుదల అవుతుందని తెలిపాడు. మరి ఈ తొలివీక్షణం ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version