లాంచ్‌ అయిన Huawei Mate 50 Pro.స్పెసిఫికేషన్స్‌ ఇవే..!!

-

హువావే మేట్ 50 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది. కాస్ట్‌ మాములుగా లేదు.. అక్షరాల లక్ష.. కెమెరా సామర్థ్యం ఓ రేంజ్‌లో ఉంది. మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ ఇలా ఉన్నాయి..

హువావే మేట్ 50 ప్రో ధర..

దీని ధరను 1,299 యూరోలుగా (సుమారు రూ.1,02,000) నిర్ణయించారు.
బ్లాక్, సిల్వర్, ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది.

హువావే మేట్ 50 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ఇందులో 6.74 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 2616 x 1212 పిక్సెల్స్‌గా ఉంది.
120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 300 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్న ఓఎల్ఈడీ ప్యానెల్‌ను అందించారు.
క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్ కాగా, 66W సూపర్ చార్జ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది.
50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. డ్యూరబులిటీ కోసం ఐపీ68 రేటింగ్‌ను కూడా అందించారు.
వైఫై 6, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
గూగుల్ యాప్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
హువావే యాప్ గ్యాలరీ ద్వారా యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
హువావే నోవా 10 ఎస్ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవలే దక్షిణాఫ్రికాలో లాంచ్ అయింది.
ఈ ఫోన్ ధరను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.
ఇది కేవలం 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 64 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ వైడ్ లెన్స్ అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version