ఇండియాలో Techno camon 19 Neo స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అమెజాన్ వేదికగా ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. ఇది ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ఇంకా ఇందులో ఉండే ఫీచర్స్ మాత్రం మినిమమ్ ఉన్నాయి..

టెక్నో కామోన్ 19 నియో ధర..
టెక్నో కామోన్ 19 నియోలో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.12,999గా నిర్ణయించారు.
ఎకో బ్లాక్, జియోమెట్రిక్ గ్రీన్, సీ సాల్ట్ వైట్ రంగుల్లో టెక్నో కామోన్ 19 నియో ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
జులై 23వ తేదీన ఈ ఫోన్ సేల్ అమెజాన్‌లో ప్రారంభం కానుంది.
టెక్నో కామోన్ 19 నియో స్పెసిఫికేషన్లు..
ఇందులో 6.8 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్‌ను అందించారు.
పంచ్ హోల్ డిజైన్, ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై టెక్నో కామోన్ 19 నియో పనిచేయనుంది.
6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండటం విశేషం.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంకా పెంచుకునే అవకాశం ఉంది.
వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 2 మాక్రో సెన్సార్, ఏఐ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా ఉంది.
ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా టెక్నో కామోన్ 19 నియో సపోర్ట్ చేయనుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.
వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, 4జీ ఎల్టీఈ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో చూడవచ్చు.
-Triveni Buskarowthu