భూమి దున్నె రైతుల దగ్గర ఖచ్చితంగా పాడి ఉంటుంది. వ్యవసాయానికి, పాలు, పెరుగు కోసంవినియోగిస్తారు . పంటలలో నష్టం వచ్చిన కూడా పాడి పశువుల ద్వార లాభాలను పొందవచ్చుననే ఆలోచన రైతులకు ఉంటుందని నమ్ముతున్నారు.. వ్యవసాయంతోపాటు పశుపోషణను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాయి..పశువుల యజమానులకు ఎదురయ్యే సమస్యలను నుంచి బయట పడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మేరకు హర్యానా ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని పశువులను కాపాడేందుకు జంతువులకు వైద్య చికిత్స కోసం మొబైల్ డిస్పెన్సరీని ప్రారంభించబోతోంది. రాష్ట్రంలో వ్యాధిబారిన పడిన జంతువులకు వైద్యం అందించేందుకు పశు సంజీవని సేవ పేరుతో సంచార వైద్యశాలను ప్రారంభించి, పశువుల యజమానుల వద్దకే వైద్యం అందించి, పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి అన్నారు.
పాడి పరిశ్రమను భారీ పెద్ద వ్యాపారంగా మారుస్తూ, తలసరి పాల పరిమాణాన్ని 1087 గ్రాములకు పెంచడం ద్వారా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హర్యానాలో, 80 నుండి 90 శాతం దూడలు లింగ క్రమబద్ధీకరించబడిన వీర్యం నుండి పుడతాయి. బ్రెజిల్ నుండి గ్రహించిన జంతు గర్భధారణ సాంకేతికత ఇక్కడ అమలు చేస్తున్నారు..ఒక్కో వీర్యం ధర రాష్ట్రంలో ఒక్కో కాన్పుకు రూ.800 ఉండగా ఇప్పుడు పశువుల పెంపకందారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోనే అతి తక్కువ ధరకే 200 రుపాయలకు అమ్ముతున్నారు. ఇలాంటి సేవలు మన రాష్ట్రంలో కూడా అమల్లొకి వస్తే బాగుండు అని రైతన్నలు అభిప్రాయ పడుతున్నారు.