‘అందాల రాక్షసి’ చిత్రంతో ఉత్తర ప్రదేశ్కు చెందిన లావణ్య త్రిపాఠి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సొట్టబుగ్గల సోయగం అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘అందాల రాక్షసి’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది.
ఇక ఆ తర్వాత నటించిన ‘భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రాలలో లావణ్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే, ఆ తర్వాత కాలంలో ఈ హీరోయిన్ నటించిన ‘దూసుకెళ్తా, శ్రీ రస్తు శుభమస్తు, అర్జున్ సురవరం, ఉన్నది ఒక్కటే జిందగీ’ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు.
అలా ఈ ఈ భామకు కొంత కాలంగా కలిసి రావడం లేదు. గతేడాది వచ్చిన ‘చావు కబురు చల్లగా’ చిత్రం కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి రూటు మార్చింది. మోడ్రన్ గర్ల్ గా లీడ్ రోల్ ప్లే చేస్తోంది ఈ సుందరి.
‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వంలో ‘హ్యాపీ బర్త్డే’ సినిమా చేసింది. యాక్షన్ క్రైమ్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ పిక్చర్ లో నరేశ్ అగస్త్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఎల్లో కలర్ డ్రెస్ లో మెరిసింది. ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.