హైదరాబాద్ శివార్లలో సుమారు ఐదు నెలలుగా జనాలకు అటవీ శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన చిరుత ఎట్టకేలకు దొరికేసింది. చిరుత కోసం సిసి కెమెరాలు బోన్ లు ఏర్పాటు చేసినా అది నాలుగు నెలలుగా ఏడిపిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కింది.
రాజేంద్రనగర్ లోని వాలంతరీలో నెల రోజుల క్రితం పశువుల కొట్టంపై చిరుత దాడి చేయడంతో వ్యవసాయ క్షేత్రంలో ప్రత్యేక బోన్ లను ఏర్పాటు చేశారు అటవీశాఖ అధికారులు. అయితే నెల రోజుల పాటు అలికిడి చేయని చిరుత వ్యవసాయ క్షేత్రంలో నెల రోజుల తరువాత మరో సారి మొన్న శుక్రవారం అర్ధ రాత్రి లేగ దూడను చంపి తినేసింది నిన్న రాత్రి మరో సారి అదే వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చిన చిరుత అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కుకుంది. దీంతో చిరుతను జూపార్క్ కు తరలిస్తున్నారు అటవీశాఖ అధికారులు