డబ్బు వల్ల వచ్చే ఆనందం శాశ్వతంగా ఉండాలంటే ఏ విధంగా ఖర్చు చేయాలో తెలుసుకోండి.

-

డబ్బు ( Money ) వల్ల ఆనందం వస్తుంది అన్న మాట నిజం కాదు. అదే నిజమైతే ఎందుకు ఎక్కువ డబ్బు ఉన్నవారు కూడా ఇబ్బందులు పడుతున్నారు? అందుకే డబ్బుకి ఆనందానికి సంబంధం లేదు. కానీ డబ్బు వల్ల ఆనందం వస్తుంది. కాకపోతే అవన్నీ తాత్కాలికమే. ఉదాహరణకి బెట్టింగ్ లో యాభైవేలు పెడితే రెండు లక్షలు వచ్చాయనుకుందాం. అది ఆనందమే. కానీ ఎంతకాలం ఉంటుంది? మరుసటి రోజు లక్ష పోయిందనుకో..! అప్పుడేంటి పరిస్థితి. మరి డబ్బు వల్ల శాశ్వతంగా ఆనందం రావాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

money | డబ్బు

జ్ఞాపకాలను కొనండి

జీవితంల్ మీరెప్పుడూ చేయనివి చేయాలి. స్కై డైవింగ్ చేయడమో, ఇతర దేశాల సాంప్రదాయ పండగల్లో పాల్గొనడమో చేయండి. ఇవన్నీ మీకు కొత్త అనుభూతిని ఇవ్వడమే కాదు జీవించాలనే కుతూహలాన్ని మరింత పెంచుతాయి.

ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఖర్చుపెట్టాలి

ప్రతీ రోజూ బిర్యానీ తెచ్చుకుని పక్కన మందు బాటిల్ పెట్టుకుని రోజుకి వేలకి వేల రూపాయలు ఖర్చు చేసేవారికి పెద్దగా ఆనందం ఉండదు. అందుకే ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఖర్చు పెట్టండి. వారానికి ఒక ఐస్ క్రీమ్ తినే మీరు నెలకి ఒకసారి కొత్త వెరైటీ ప్రయత్నించండి. మీరు తినే ప్రతీ ఐస్ క్రీమ్ ని అనుభూతి చెందుతారు.

సాయాన్ని కొనండి

మీ ఇంట్లో మీతో పాటు ఉన్నవారే అన్ని పనులు చేయకుండా ఇతరులకు ఆ పనులు అప్పగించండి. మీకు వీలైతే పనిమనుషులను పెట్టుకోండి. తద్వారా మీ కుటుంబంతో మరింత సమయాన్ని గడపవచ్చు. ఇది కేవలం మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికే అయ్యుండాలి కానీ బద్దకించి అయ్యుండకూడదు.

భవిష్యత్ ప్రణాళిక

రేపటికి రూపం లేదు నిజమే. కానీ, రేపటి కోసం ఈరోజు డబ్బు దాచడం అనేది ఖచ్చితంగా అవసరం. అందుకే కొంత డబ్బు పక్కన పెట్టండి. బాగా ఆలోచించి మంచి మంచి పెట్టుబడుల్లో మీ డబ్బులను పెట్టండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version