బ్రేకింగ్: కరోనా కాలంలో మార్కులు తక్కువ వచ్చాయని చితకబాదిన లెక్చరర్.

-

కరోనా కారణంగా పాఠశాలలు ఎంత మేర పనిచేస్తున్నాయో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. గత సంవత్సరం నుండి ఇదుగో ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి, అప్పుడు ఓపెన్ అవుతున్నాయంటూ రకరకాల వార్తల మధ్య చివరి మూడు నెలలు మాత్రమే పనిచేసే విధంగా కళాశాలలకి అనుమతి లభించింది. దాదాపు 9నెలల పాటు చదువు లేకుండా ఆన్ లైన్లో ఏం చెబుతున్నారో అర్థం కాకుండా ఉన్న విద్యార్థులకి కళాశాల ప్రారంభంలో కొంత తడబాటు ఉండడం సహజమే.

 

సిలబస్ ఎంత మేరకు తగ్గించినప్పటికీ మునుపటిలా స్పీడ్ అందుకోవడం కష్టమే. ఈ విషయం ఆ లెక్చరర్ గ్రహించాడో లేదో కానీ తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థిని చితకబాదాడు. అవును, కరోనా కాలంలో ఉన్నా కూడా మార్కులు తక్కువ వచ్చాయని ముందుగా స్కేలు తో కొట్టిన లెక్చరర్, అది కింద పడిపోవడంతో విద్యార్థి జుట్టు పట్టుకుని మరీ కొట్టడం ఆంధ్రప్రదేశ్ లోని రాజోలులో శ్రీ చైతన్య కాలేజీలో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. కరోనా కాలంలో చదువు గురించి పిల్లలని బలవంతం చేయద్దని అటు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ చదువుకున్న లెక్చరర్లే ఇలా చేయడం వింతగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version