ఏపీ సీఎం జగన్ కి సుప్రీం కోర్టు షాకిచ్చింది. జస్టిస్ రమణ పై ఏపీ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై “ఇన్-హౌస్” విచారణ జరిపి, అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత కొట్టి వేసినట్లు సుప్రీంకోర్టు అధికారిక ప్రకటన చేసింది. “ఇన్-హౌస్” విచారణ అంశాలు సహజంగా బయటకు వెల్లడి చేయమని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
జస్టిస్ రమణ పై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకి గత అక్టోబర్ 6 వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ వ్రాశారు. ఆ తర్వాత, సర్వోన్నత న్యాయస్థానానికి ఈ ఆరోపణలతో కూడిన అఫిడవిట్ ను కూడా ఏపీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి దాఖలు చేశారు. అయితే ఈరోజు ఎన్వీ రమణ కాబోయే చీఫ్ జస్టిస్ అంటూ బాబ్డే కేంద్ర న్యాయ శాఖకి లేఖ రాసిన కొద్దిసేపటికే సుప్రీంకోర్టు ఇలా ప్రకటించడం సంచలనంగా మారింది.