కాళ్ళ వాపు అనేది చాలా సాధారణంగా కనిపించే ఒక ఆరోగ్య సమస్య. ఎక్కువసేపు నిలబడడం కూర్చోవడం వంటి వాటి వల్ల వాపు వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ఈ సాధారణ వాపు వెనుక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు దాగి ఉండవచ్చు. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వంటి అంతర్గత వ్యాధులు కాళ్ల వాపుకు ప్రధాన కారణం కావచ్చు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా దాని వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.. కాళ్ళ వాపు కు కారణమయ్యే కొన్ని ముఖ్యమైన వ్యాధుల గురించి తెలుసుకుందాం..
కాళ్ల వాపు (ఎడిమా) అనేది శరీరంలో అదనపు ద్రవాలు పేరుకుపోవడం వల్ల వస్తుంది. ఇది ఒక లక్షణం మాత్రమే, ఇది వ్యాధి కాదు ఈ లక్షణం కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది.
గుండె జబ్బులు: గుండె సరిగ్గా రక్తాన్ని పంపించేటప్పుడు అది కాళ్లలో ద్రవాలు పేరుకు పోవడానికి కారణం అవుతుంది. దీన్ని కంజీస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు ఈ పరిస్థితిలో కాళ్లు వాపులో పాటు శ్వాస ఆడక పోవడం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కిడ్నీ వ్యాధులు: మూత్రపిండాలు శరీరంలో వ్యర్థాలను అదనపు ద్రవాలను బయటికి పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే ఆ ద్రవాలు శరీరంలో ఉండిపోయి కాళ్లలోవాపు కు కారణం అవుతాయి.

లివర్ డిసీజెస్: కాలేయం దెబ్బతిన్నప్పుడు శరీరంలో ద్రవాలను నియంత్రించే ప్రోటీన్లు ఉత్పత్తి కావు దీనివల్ల పొట్టలో మరియు కాళ్లలో ద్రవాలు పేరుకుపోయి వాపు వస్తుంది.
కాళ్లలోని శిరలలో రక్తం గడ్డ కట్టినప్పుడు అది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీని వల్ల ప్రభావితమైన కాళ్లలో తీవ్రమైన వాపు నొప్పి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి వెంటనే వైద్య సలహా తీసుకోండి.
కాళ్ళ వాపును ఎప్పుడు సాధారణంగా తీసుకోవద్దు. ఇది గుండె కిడ్నీలు, కాలేయానికి సంబంధించిన తీవ్రమైన వ్యాధులకు సూచన కావచ్చు. మీకు తరచుగా కాళ్ళ వాపు ఉంటే దానితోపాటు ఇతర లక్షణాలు అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది నొప్పి వంటివి కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి.
గమనిక:పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, వైద్యపరమైన సలహా కోసం మీరు తప్పక డాక్టర్ను సంప్రదించాలి.