దిగ్గజ నటుడు కాంతారావు కుటుంబం కడు పేదరికంలో.!

-

నటుడు కాంతారావు  పాత తరం వారికి ఆరాధ్యుడు. తాను వందల సినిమాలలో నటించాడు. అప్పట్లో తాను ఫైట్స్ లో కత్తి తిప్పడం చూసి ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి స్టార్ హీరోలే బెంబేలెత్తి పోయేవారట. దీంతో ఆయన పేరు కత్తి కాంతారావు గా స్థిరపడి పోయింది.బుధవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో కాంతారావు శతజయంతి వేడుకలు నిర్వహించారు.

వాస్తవానికి కాంతారావు గారిది సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం లోని గుడిబండ అనే చిన్న గ్రామం. చిన్నప్పటి నుండి ఎన్నో నాటకాలలో వేషాలు వేసి మంచి పేరు తెచ్చుకున్నారు.ఇక అక్కడినుండి సినిమా లో నటించడం కోసం మద్రాసు నగరం కు వెళ్ళారు. ఎన్నో కష్టాలు పడి సినిమా పరిశ్రమ లో మంచి పేరు సంపాదించారు. అప్పట్లో ఏంతో సంపాదించి గొప్పగా బతికిన కాంతారావు కుటుంబం ప్రస్తుతం పేదరికం లో ఉంది.

రవీంద్రభారతిలో కాంతారావు శతజయంతి వేడుకలలో ఆయన కొడుకు రాజా తమ పేదరికం గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.తమ తండ్రి సినిమాలలో నటించే టప్పుడు పెద్ద బంగళా లో వుండే వారమని చెప్పాడు. తర్వాత కొన్ని సినిమాలు స్వయంగా తీసి నష్టాలు వచ్చి  ఆస్తులు మొత్తం అమ్మేసారని, నాన్న చనిపోయిన తర్వాత తాము మరింత పేదరికంలో వున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సిటీకి దూరంలో అద్దె ఇంట్లో ఉంటున్నామని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version