నిమ్మకాయ వల్ల ఎటువంటి బెనిఫిట్ మనకి కలుగుతాయి అని తెలుసు. కానీ నిమ్మ తొక్క వల్ల కలిగే బెనిఫిట్స్ చాలా మందికి తెలియవు. మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం. నిమ్మ తొక్క లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ పెక్టిన్ వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మన లివర్ లో బైల్ యాసిడ్స్ బాగా రిలీజ్ అయ్యేలా కూడా ఇది సహాయ పడుతుంది. ఇలా నిమ్మ తొక్క కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది.
అధిక బరువును తగ్గించడానికి కూడా నిమ్మ తొక్క బాగా ఉపయోగ పడుతుంది. బీపీని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. నిమ్మ తొక్క లో ఉండే డి లయమునిన్ గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ ను తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. గాల్ బ్లాడర్ లో కొంత మందికి రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి కదా వాటిని కూడా నయం చేయడానికి నిమ్మ తొక్కలు ఉపయోగ పడతాయి. గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉన్న 200 మందికి ఈ ఇంజక్షన్ ఇస్తే 96 మందికి పూర్తిగా నయం అయిపొయింది.
నిమ్మకాయ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి కూరల్లో కూడా వేసుకోవచ్చు. లేదు అంటే మార్కెట్లో డైరెక్ట్ గా నిమ్మ తొక్కల పొడి మనకు దొరుకుతుంది. ఓపిక ఉంటే స్వయంగా చేసుకుంటే మరింత మంచిది. గ్రీన్ టీ చేసుకునేటప్పుడు నిమ్మ తొక్కలను వేసి మరిగించి ఆ టీ తాగితే మంచి ప్రయోజనం కలుగుతుంది. మనం చేసుకునే రకరకాల జ్యూసులు లో కూడా నిమ్మ తొక్కలు వేసుకుని తాగొచ్చు. నిమ్మ తొక్కలతో చట్నీ కూడా చేసుకోవచ్చు. నిమ్మ తొక్కలను ఎండబెట్టక పోయినా చిన్న చిన్న ముక్కలుగా చేసి రోజు వారి వంటలో వేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.