ఇద్దరు వ్యక్తులపై చిరుత దాడి.. వీడియో వైరల్

-

సాధారణంగా జంతువులు మనం వాటిని ఏం చేస్తామోనని భయపడి వాటి స్వీయరక్షణకై అప్పుడప్పుడు మనపై దాడి చేస్తుంటాయి. అలాంటి ఓ ఘటనే కర్ణాటకలోని మైసూరులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అటవీశాఖ అధికారి సుసాంత నందా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా ఇప్పుడది తెగ వైరల్‌ అవుతోంది. అసలేం జరిగిందంటే..?

జనావాసంలోకి వచ్చిన ఓ చిరుతపులిని చూసి ఓ భవనంపై ఉన్న జనం రాళ్లు రువ్వడంతో భయపడిపోయిన చిరుత రోడ్డు వైపునకు పరిగెత్తి అటుగా వస్తున్న ఓ బైకర్‌ను ఢీ కొట్టింది. దీంతో కింద పడిపోవడంతో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. ఓ రాయితో దాని వెనకే వెళ్లిన మరో వ్యక్తిపై చిరుత తిరబగడి గాయపర్చింది.

11 సెకన్లపాటు ఉన్న ఈ వీడియోను సుసాంత నందా ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఇప్పటికే ఆందోళనలో ఉన్న చిరుతను స్థానికులు మరింత గందరగోళానికి గురిచేశారు. వారికి కనిపించడమే అది చేసిన తప్పు. దాన్ని చూసిన వారు క్రూరంగా మారడంతో ఆ అడవి జంతువు రక్షణ కోసం పోరాడింది. అటవీశాఖ అధికారులు దాన్ని కాపాడారు’ అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version