కళ్ళ ముందు చిరుత పులి కనపడితే…? గుండెలు జారిపోతాయి. అందుకే వాటికి చాలా దూరంగా ఉండటానికే ఆసక్తి చూపిస్తాం. ఎక్కడైనా అవి కనపడినా సరే భయం తో వణికిపోతాం. వాటి ముందు నిలబడటం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడినట్టే. తాజాగా ఒక వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ కి ప్రాణం మీదకు వచ్చింది. వివరాల్లోకి వెళితే డైలీ మెయిల్ కథనం ప్రకారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఒక వీడియోలో… దక్షిణాఫ్రికాలోని సాబీ సాండ్స్ ప్రకృతి రిజర్వ్ వద్ద ఒక గేమ్ రేంజర్ డిల్లాన్ నెల్సన్ ఒక తల్లి చిరుతపులిని,
మరియు దాని పిల్లను చిత్రీకరిస్తున్న సమయంలో ఒక పిల్ల అతని వద్దకు వచ్చింది. వీడియోలో, 10 నెలల వయస్సు ఆమె మట్టిదిబ్బ నుండి క్రిందికి దిగి మొదట తన బూటును ఆసక్తికరంగా పరిశీలిస్తూ ఉంటుంది. దీనిపై మాట్లాడిన 25 ఏళ్ళ ఫోటోగ్రాఫర్ “నేను ఈ ప్రాంతంలో గేమ్ రేంజర్ లేదా నేచర్ గైడ్‌గా పని చేస్తున్నాను మరియు ప్రజలను సఫారీ మరియు బుష్ వాక్స్ లోకి తీసుకువెళతానని చెప్పాడు. “మేము చాలా దట్టమైన చిట్టడవి గుండా వెళుతున్నప్పుడు తాము ఒక ఆడ చిరుత పులిని అనుసరిస్తున్నామని,
ఆ పిల్ల చాలా చిన్నదని దానికి 10 నెలల వయసు ఉంటుందని ఆయన తెలిపాడు. ఆ పులి పిల్ల తన బూటు ఆసక్తిగా ఉండటంతో నా షూ ఏంటో కనుక్కోవడానికి వచ్చింది అన్నారు. తన వద్దకు రావడానికి అది ప్రయత్నిస్తున్న సమయంలో తనకు తెలుసు అని కాకపోతే అక్కడి నుంచి కదలడానికి చాలా ఆలస్యం అయిందని… దీనితో తాను కదలకుండా ఉండి దానికి సహకరించాలని అనుకున్నానని అతను వివరించాడు. అయితే పులి అతన్ని ఏమీ చేయలేదు. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది.