ప్రతీ నెల మీరు డబ్బులు పొందాలని అనుకుంటున్నారా…? అయితే మీరు దీని కోసం తప్పక చూడాలి. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ LIC ఆఫ్ ఇండియా ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. వీటి వలన మనకి మంచి లాభాలు ఉంటాయి. అయితే టర్మ్ ప్లాన్స్, మనీ బ్యాక్ ప్లాన్స్, చిల్డ్రన్స్ ప్లాన్స్ ఇలా ఎన్నో రకాల లాభాలని అందిస్తోంది.
దీని వలన మనకి మంచి రాబడి వస్తుంది. అయితే ఈరోజు ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పాలసీ గురించి చూద్దాం. 2023 మార్చి 31 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఈ స్కీమ్ టెన్యూర్ 10 ఏళ్లు. 60 ఏళ్ల వయసు కలిగిన వారు ఈ పథకంలో చేరొచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన వారు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున పెన్షన్ తీసుకోవచ్చు.
ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ స్కీమ్ కేవలం సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే అవుతుంది. 7.66 శాతం వడ్డీ రేటు పొందొచ్చు. నెలకు గరిష్టంగా రూ.9250 పెన్షన్ వస్తుంది. మీరు కనుక రూ.1.62 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే… మీరు నెలకు రూ.1000 పెన్షన్ పొందొచ్చు.
రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తే నెలకు రూ.9250 పొందొచ్చు. స్కీమ్‌లో చేరిన వ్యక్తి మరణిస్తే నామినీకి తిరిగి డబ్బుల్ని ఇస్తారు. లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మూడేళ్ల తర్వాత లోన్ తీసుకోవచ్చు. 75 శాతం మొత్తాన్ని రుణం కింద పొందొచ్చు.